top of page

ఫిరంగిపురం లో ప్రారంభమైన శ్రీ విజయ దుర్గ అమ్మవారి 12 వ వార్షిక మహోత్సవములు

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 7, 2022
  • 1 min read

ఫిరంగిపురం లో ప్రారంభమైన శ్రీ విజయ దుర్గ అమ్మవారి 12 వ వార్షిక మహోత్సవములు.

ఫిరంగిపురం విజయ దుర్గా నగర్ లో ఉన్న విజయ దుర్గా అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి 12 వ వార్షిక మహోత్సవములు బుధవారం ప్రారంభమయ్యాయి, సందర్భంగా ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, అఖండ స్థాపన దుర్గా అమ్మవారి ప్రధాన కలశ స్థాపన సుగంధ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు వల్లూరి రాజేంద్ర శర్మ అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


7వ తేదీన ఉదయం 8 గంటల నుండి ప్రార్థన, మండప దేవతాపూజ, చండీ హోమం జరుగును. 8 వ తేదీన శుక్రవారం అమ్మవారి సహస్ర మార్చిన, పూర్ణాహుతి జరుగును అని తెలిపారు, మండలంలోని భక్తులు మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని అమ్మవారి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Click on the pic to visit our website
Click on the pic to visit our website

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page