శ్రీ విద్యా జూనియర్ కళాశాల విద్యార్థి గణేష్ కు ప్రతిభా పురస్కారం
- VOICE OF HERALD

- 7 days ago
- 1 min read
శ్రీ విద్యా జూనియర్ కళాశాల విద్యార్థి గణేష్ కు ప్రతిభా పురస్కారం


వైయస్సార్ కడప జిల్లా
2026 విద్యా సంవత్సరమునకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్-2026 ప్రతిభా పురస్కారాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 33 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు దక్కాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డు నందు గల శ్రీ విద్యా జానియర్ కళాశాలకు చెందిన K.T. గణేష్ (MPC) కు ప్రతిభా పురస్కారం - షైనింగ్ స్టార్ - 2026 పురస్కారం దక్కింది. ఈ విద్యార్థి సీనియర్ ఇంటర్మీడియట్ నందు 994 మార్కుల తో స్టేట్ ఫస్ట్ నిలిచాడు. నేడు కడప పట్టణం నందు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన పురస్కారాల అభినందన సభలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఐఏఎస్ చేతుల మీదుగా 20,000/- నగదు బహుమతి, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం K.T. గణేష్ అందుకున్నాడు. అలాగే రాజంపేట సబ్ కలెక్టర్ H.S. భావన, టీచర్స్ MLC రామచంద్ర రెడ్డి, జిల్లా RIO PLN ప్రకాష్ రావు పట్నాయక్ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ గా నిలిచిన గణేష్ ను అభినందించారు. అలాగే MEC గ్రూపు నందు కె. గీతిక 978 మార్కులతో ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.
శ్రీవిద్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ఎస్ శ్రీకాంత్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ కేఓవి రమణ రావు, కళాశాల డైరెక్టర్ మలిశెట్టి రామ్ మోహన్, దస్తగిరి, ఆధ్యాపక అధ్యాపకేతర బృందం గణేష్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.





GOOD