top of page

అనుంపల్లి లో సత్యమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్ట.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 16, 2022
  • 1 min read

అనుంపల్లి లో

సత్తెమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట.

--అలరించిన ఆసాదుల కథలు.



అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం రాజుకుంట పంచాయతీ అనుంపల్లి గ్రామం నందు ఈరోజు ఉదయం గ్రామ దేవత అయిన సత్యమ్మ తల్లి పాత విగ్రహ స్థానంలో నూతన విగ్రహాన్ని గ్రామ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆసాదుల చేత ఆయుష్షును, శక్తులను నింపి పునః ప్రతిష్ట గావించారు.



ఆసాదులవారు సత్యమ్మ తల్లి చరిత్రను పద్యరూపంలో గానం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామ ప్రజలు మూకుమ్మడిగా పాల్గొని విగ్రహ పునః ను విజయవంతంగా నిర్వహించారు.



ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాదినేని సుధాకర్, మాదినేని కుమార్, గుత్తి సుబ్బరాయుడు, నానబాల శ్రీనివాసులు పసుపులేటి ఈశ్వరయ్య , యువత మరియు మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page