top of page

వైబియన్ పల్లెలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 30, 2023
  • 1 min read

వైబియన్ పల్లెలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

ప్రత్యేక అలంకరణలో అభయాంజనేయ స్వామి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల పరిధిలోని వైబియన్ పల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ వినాయక అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆకు పూజ, వడమాల తదితర పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి అప్పలాచారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page