top of page

ఆశ్రమంలో అవినీతికి అంతు ఏది?

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 17, 2022
  • 1 min read

Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365

* - * - * - * - *


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ఏ.ఓ చేతివాటానికి సహకరిస్తున్న సహోద్యోగులు.

పలు పద్దుల రూపంలో కోట్ల రూపాయలు స్వాహా.

కొద్ధి సంవత్సరాలుగా ఇక్కడే పాగా.

ప్రతి సోమవారం కార్యాలయంలో మకాం.

పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ కృష్ణ గీతాశ్రమము (నామా ఎరుకలయ్య ఆశ్రమము) నందు ప్రస్తుత ఇంచార్జి సహాయ కమీషనర్ శంకర బాలాజీ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం శ్రీ కృష్ణ గీతాశ్రమం నందు శారదా ఇంటర్మీడియట్ కళాశాల నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండంట్ ఎం. సురేష్ బాబు రెడ్డి నేడు తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి శంకర్ బాలాజీ ఆశ్రమం నందు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ఏడు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శంకర్ బాలాజీ పలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు స్వాహా చేశారని ఆరోపణలు గుప్పించారు. జరుగుతున్న అవినీతి గురించి తాను సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసినప్పటికీ, అధికారుల నుండి స్పందన కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.


కాగా వివిధ రకాల పద్దుల రూపంలో 2018 నుండి నేటి వరకు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలకు ఉపక్రమించి, అవినీతి అధికారిపై తగు చర్యలకు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page