శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం నందు సీతమ్మ వారికి బంగారు కాసుల దండ వితరణ
- VOICE OF HERALD

- Feb 9, 2022
- 1 min read
వై.యెస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని అగస్త్యేశ్వర స్వామి మరియు సీతమ్మ వారికి నాలుగున్నర లక్షల రూపాయల విలువ గల బంగారం సేవ శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం నందు సీతమ్మ వారికి బంగారు కాసుల దండ 62.486 గ్రాములు ,విలువ 3,00,000/- మరియు 30.746 గ్రాముల బంగారం విలువ రూ 1,50,000/- గోలుసును శ్రీ స్వామి వారికి కి.శే మోడెం సుబ్బారాయుడు జ్ఞాపకార్థం వారి ధర్మ పత్ని మోడెం రాజమ్మ, వై.ఎం.ఆర్ కాలనీ ప్రొద్దుటూరు వారు సేవ సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మైన్ శెట్టిపల్లె రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి లో భాగంగా వితరణ శీలులు అందరూ భాగ్యస్వాములు కావలెనని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి C. శంకర బాలాజీ, ధర్మకర్త K. విజయ్ కుమార్, భక్తాదులుM. విష్ణునారాయణ, M. జగన్ మోహన్ రెడ్డి, బొల్లవరం లింగా రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.




Comments