top of page

శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాహ్నవి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 26, 2021
  • 1 min read

అచ్చతెలుగు అమ్మాయిలాగా లంగా వోణీలో తల్లిని గుర్తు చేస్తోన్న తనయ, కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి పుణ్య క్షేత్రం తిరుమల... ఈ రోజు ఉదయం  శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినిత్ శరన్, సంజయ్ కిషన్ కౌల్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి మలయప్పస్వామికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.  జాహ్నవి కపూర్ కు అర్చకులు  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే జాహ్నవి కపూర్ అచ్చ తెలుగమ్మాయిలా లంగావోణీ వేసుకుని వచ్చింది. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో  స్వామివారిని దర్శించుకోవడం అందరిని ఆకర్షించింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page