top of page

పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు - పంచాయతీ కార్యదర్శి బాల కుమార్

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 17, 2023
  • 1 min read

పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు - పంచాయతీ కార్యదర్శి బాల కుమార్

మురికిని తొలగిస్తున్న జెసిబి

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట:

పారిశుధ్యం పైన ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందని ఊటుకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.బాల కుమార్ తెలియజేశారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి బాల కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలలో జేసీబీ తో కాలువలలోని పూడికలు తీయించారు. మురికి, చెత్తను తొలగింపజేశారు. ఈ సందర్భంగా బాలకుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడేది లేదని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పంచాయతీ పరిధిలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సహాయకులు వెంకటయ్య పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page