top of page

17న స్పందన అర్జీల స్వీకరణ తాత్కాలిక రద్దు - కలెక్టర్

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 16, 2022
  • 1 min read

కడప జిల్లా లో కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెల 17న (సోమవారం) "స్పందన" అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు జిల్లా కలెక్టరేట్ కు రావద్దని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page