top of page

పేదల పక్షపాతి జగన్ - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 7, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు

సోములవారిపల్లె పంచాయతీ పరిధిలోని ఈశ్వర్ రెడ్డి నగర్ నందు బుధవారం సాయంత్రం పంచాయతీ సర్పంచ్ మోపురి ప్రశాంతి, ఎంపీపీ శేఖర్ యాదవ్, ఎంపీటీసీ గోటూరు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈశ్వర్ రెడ్డి నగర్ లోని కుటుంబాలను నేరుగా కలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు మూడేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. స్థానికంగా ఉన్న పెద్దలు చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి. వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి. వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి. మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు భూమి రెడ్డి వంశీదర్ రెడ్డి, కోనేటి సునంద .కమాల్ భాష, వైసిపి నాయకులు ఆచారి కాలనీ శివారెడ్డి. అగ్గరపు శ్రీనివాసులు. రాయపురెడ్డి, గజ్జాల కళావతి, పద్మావతి, సచివాలయం సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు, ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page