top of page

ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి భాజపా ఎల్లప్పుడు సిద్ధం - సోమూ వీర్రాజు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 14, 2022
  • 1 min read

కడపజిల్లా, ప్రొద్దుటూరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా సమావేశం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి భాజపా ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నదని, బ్రహ్మంసాగర్ వంటి ప్రాజెక్టులు వద్ద ఆందోళనలు సాగిస్తాం అని తెలిపారు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు, హంద్రీనీవా, గాలేరి నగరి, ప్రాజెక్టులు పరిస్థితి ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం మార్చి నుండి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ధాన్యం కొన్నా రైతులకు సొమ్ము చెల్లింపు చేయడం లేదు అని ఎద్దేవా చేశారు, వ్యవసాయ శాఖకు కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట్రం ఖర్చు చేయడం లేదు అన్నారు. వివిధ శాఖల పరిధిలో అనేక ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సోమశిల నిరాశ్రయుల విషయంలో భాజపా ఉద్యమానికి సిద్ధం అని అలాగే సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమం కొనసాగిస్తాం అని సోమూ వీర్రాజు ఈ సందర్భంగా తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page