top of page

సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో విజిలెన్స్ అధికారుల ఇన్స్పెక్షన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 25, 2022
  • 1 min read

విజిలెన్స్ తనిఖీలు:-

ఈ దినం అనగా 25.07.2022 తేదీ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శంఖ బ్రత భాగ్చి IPS ఉత్తరువుల మేరకు రాష్ట్రం అంతటా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ను విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలలో, తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన కె. ఈశ్వరరెడ్డి పర్యవేక్షణ లో నాలుగు బృందాలు తిరుపతి, చిత్తూరు జిల్లాలలోని వివిధ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల వసతి సౌకర్యాలు, నిర్వహణ, నిధుల వినియోగం, ఆరోగ్య, ఆహార విషయాల మీద ఆరా తీస్తున్నారు. సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి V&E అధికారి అయిన కె. ఈశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇక మీదట రెగ్యులర్ గా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తామని అలాగే హాస్టల్స్ నిర్వహణలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారులపై నివేదికలు పంపుతామని చెప్పారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page