top of page

నాగుపాము నుదుట ముద్దు పెట్టబోయాడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 3, 2022
  • 1 min read

నాగుపాము నుదుట ముద్దు పెట్టబోయాడు.. రివర్స్‌లో ‘లిప్‌లాక్‌’ పడింది!

విషం ఉందని తెలిసి కూడా ప్రేమతో ఆ నాగుపాముకు ముద్దు పెట్టబోయాడు ఆ వ్యక్తి. కానీ, ఆ నాగుకి అతగాడి ప్రేమ నచ్చలేదేమో!. అందుకే ఒక్కపెట్టున మూతి మీద కాటుతో ఆ ప్రేమను అదే రేంజ్‌లో తిప్పి కొట్టింది.* పాముల్ని పట్టి సురక్షితంగా వదిలేసి ఓ వ్యక్తి.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకుని ఓ నాగుపామును ఒడిసి పట్టేసుకున్నాడు. అయితే.. అందరూ వీడియో తీస్తున్నారనే అత్యుత్సాహంలో అతగాడు.. ఆ పాము తల మీద ముద్దు పెట్టబోయాడు. కర్ణాటక శివమొగ్గ జిల్లా భద్రావతి బొమ్మనకట్టేలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాము అతని మూతిపై కాటేసింది. దీంతో అతగాడు పామును వదిలేశాడు. ఆపై ఒకతను ఆ పామును పట్టే యత్నం చేయగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. కాటేయించుకున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా..


పాము చిన్నది కావడం, విషం మోతాదు తక్కువగా ఉండడం, సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ లిప్‌ టు లిప్‌ ఘాటు ముద్దుపై సోషల్‌ మీడియాలోనూ అంతే రేంజ్‌లో ‘అలా జరగాల్సిందే..’ అంటూ సెటైర్లు పేలుతున్నాయి.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page