top of page

ఆచార్య కాలనీలో శివారెడ్డి అభిమానుల కోలాహలం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 1, 2023
  • 1 min read

అభిమానుల మధ్య శివారెడ్డి నూతన సంవత్సర వేడుకలు


భారీగా తరలివచ్చిన అభిమానులు

ప్రొద్దుటూరు మండలం, గోపవరం పంచాయతీ పరిధిలోని ఆచార్ల కాలనీలో వైసిపి నాయకులు గంజికుంట శివారెడ్డి, అభిమానులు, ఆప్తుల కోలాహలం మధ్య నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఆదివారం అభిమానులు ఊరేగింపుగా గంజికుంట శివారెడ్డి నివాసానికి చేరుకొని భారీ గజమాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు తన నివాసానికి చేరుకున్న అభిమానులు, ఆప్తులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవనం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు, శివారెడ్డి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page