కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం
- VOICE OF HERALD

- Feb 25, 2022
- 1 min read
జీవీఎంసీ 66వ వార్డు పరిధి కైలాష్ నగర్లో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వేడుకల్లో గాజువాక వైస్సార్సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందజేసి ఆలయ అర్చకుల మంత్రోర్చనలతో పూజలో పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమరాధన కార్యక్రమం ప్రారంభించి దేవుని ప్రసాదం భక్తులకు వితరణ చేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కరణం వేణుగోపాలరావు,రెడ్డి జగన్నాధం, సభ్యులు కర్రి జగన్మోహన్, కమిటీ పెద్దలు, సభ్యులు, యువత, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



Comments