top of page

సిరిపురి మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎంపీ అవినాష్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 20, 2023
  • 1 min read

ఎంపీ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా సిరిపురి మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం సాయంత్రం పట్టణంలోని టీబీ రోడ్డు వైఎంఆర్ కాలనీ మలుపు వద్ద నూతనంగా నిర్మించిన సిరిపురి మున్సిపల్ కాంప్లెక్స్ ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఖాజా, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జంకా విజయలక్ష్మి, పలువురు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలులో కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఎక్కడ రాజీ పడకుండా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు సౌకర్యాల కల్పనలో తాము పెద్దన్న పాత్ర పోషించామని, రానున్న ఆరు నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page