top of page

షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా కదిలిన ట్రైన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 11, 2022
  • 1 min read

షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా కదిలిన ట్రైన్

తాజాగా ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. దీనికి చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాలు.. భాగల్‌పూర్‌ స్టేషన్‌లో పట్టాలపై గూడ్స్‌ రైలు ఆగి ఉంది. స్టేషన్‌లో ఓ వ్యక్తి ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్‌కర్ట్‌ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్‌ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో చప్పుడు చేయకుండా ఆ వ్యక్తి అలాగే పడుకొని ఉండిపోయాడు. ట్రైన్‌ కింద ఉన్న వ్యక్తికి ఏమైందో ఏమోనని చుట్టూ గుమిగూడిన భయంతో వణికిపోయారు. రైలు వెళ్లేంతవరకు కదలవద్దని కేకలు వేస్తూ హెచ్చరించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page