top of page

చిన్నారి షబానాకు ఆర్ధిక సాయం చేసిన రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 5, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ ఖాదరాబాదు గ్రామంలో జులై 26వ తేదీన పాఠశాల మరమ్మతులు చేపడుతుండగా ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వలన ప్రమాదానికి గురైన పదమూడు సంవత్సరాల షబానాను సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి గురైన షబానా తల్లిదండ్రులకు నేనున్నాననే భరోనా కల్పించి వారికి అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సాహయం అందచేశారు. ఈ సందర్భమగా ఆయన మాట్లాడుతూ, జరిగిన సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని, ప్రమాదం జరిగినప్పుడు షబానాకు మెరుగైన వైద్యా సహాయం అందించటం కోసం తాను చేసిన కృషిని తెలియచేస్తూ, చిన్నారి షబానా తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తన దృష్టికి పార్టీ నాయకులు తీసుకునిరాగా, మానవతా కోణంలో ఆలోచించి నేడు లక్ష అరవై వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో తనకు అందిస్తున్నట్లు, రాబోవు రోజుల్లో షబానా తల్లిదండ్రులకు తన చేతనైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. షబానా తల్లిదండ్రులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఖాదరాబాదు గ్రామ ప్రజలు, రాచమల్లు అభిమానులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page