top of page

SCNR కాలేజ్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 3, 2022
  • 1 min read

శ్రీ శెట్టిపల్లె చిన్న నాగిరెడ్డి కళాశాల (SCNR) college అభివృద్ధి కోసం కాలేజీ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన నుండి 24 కోట్ల రూపాయలు నిధులు తీసుకవచ్చిన పూర్వ విద్యార్థి మరియు ప్రొద్దుటూరు శాసన సభ్యులు శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారిని సన్మానిస్తున్నట్లు శివాలయం చైర్మన్ శెట్టిపల్లె రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే దాత శ్రీ శెట్టిపల్లె చిన్న నాగిరెడ్డి కుమారుడు శ్రీ శెట్టిపల్లె రఘురామ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మరియు కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9:30 నిమిషములకు 4/1/2022 SCNR కళాశాలలో జరపబడును అని తెలిపారు. అలాగే పూర్వ విద్యార్థులు అందరు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని గత కాలేజీ జ్ఞాపకాలను నెమరు వేసుకొని. ఈ సన్మాన సభలో పాలుపంచుకోవాలని పూర్వ విద్యార్థి s. రాం ప్రసాద్ రెడ్డి మరియు కాలేజి ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారు కోరుకున్నారు.


ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కౌన్స్లర్ కమాల్ భాష, మల్లికార్జున యాదవ్ (కొ ఆప్షన్ ) మెంబెర్, వైసీపి నాయకులు రాయపురెడ్డి, నాగ శేషా రెడ్డి,బాషా,జగదీష్, శివరామి రెడ్డి మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page