top of page

ఎస్సీ సంక్షేమ సంఘం నూతన కమిటీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 31, 2022
  • 1 min read

ఎస్సీ సంక్షేమ సంఘం నూతన కమిటీ

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


శనివారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఎస్సీ సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు పి. పెద్ద రాజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ సంఘ రాయలసీమ కమిటీలు రద్దు కాబడ్డాయని, నూతన కార్యవర్గంలో తన అధ్యక్షతన రాయలసీమ ప్రధాన కార్యదర్శిగా చింతల రాజేష్, రాయసీమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొబ్బరపు సురేష్, కడప జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కె.ఎం విలియం, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బత్తల సుబ్బారాయుడు కి బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ప్రకటించి ఉత్తర్వులను వారికి అందజేశారు.

ఇదే సందర్భంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులను ఆయన ఖండించారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ సంఘం సిద్ధాంతాలు నచ్చి తాము సంఘంలో చేరామని, సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని, తమను నమ్మి ఎస్సీ సంక్షేమ సంఘం ఇచ్చిన పదవులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page