top of page

ఆకతాయిల హల్ చల్... మహిళల గుండెలు గుబేల్...

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 23, 2022
  • 1 min read

సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు నాగన్న కుంటలో ఆకతాయిల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే హేళనగా మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తింస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒంటరి మహిళలు టార్గెట్గా చేసుకుని కొందరు యువకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిల పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఇదే తరహాలో పలుమార్లు ఆకతాయిలు వేధించినట్లు కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నాగన్న కుంట ప్రాంతంలో, ఆకతాయిల కారణంగా మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆకతాయిల పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బలంగా వినిపిస్తోంది.. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పట్టుబడిన ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page