మాజీ సర్పంచ్ జయమ్మ మృతిపట్ల సంతాపం తెలిపిన ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి
- VOICE OF HERALD

- Apr 25, 2022
- 1 min read
(ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ రాయచోటి విలేకరి)

మాజీ సర్పంచ్ జయమ్మ మృతిపట్ల సంతాపం తెలిపిన ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డిలు. చిన్నమండెం మండలం పడమటికోన మాజీ సర్పంచ్ జయమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం పడమటికోన హరిజనవాడాలో జయమ్మ భౌతికకాయాన్ని ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులును పరామర్శించారు. మండిపల్లె శివారెడ్డి, బాబు రెడ్డి, రామణారెడ్డి, నాగశేషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Comments