top of page

సంక్రాంతి ముందస్తు సంబరాల్లో పాల్గొన్న పవిత్ర రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 8, 2022
  • 1 min read

శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ నందు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి బియ్యపు. ముందుగా పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం శ్రీపవిత్ర రెడ్డి భోగిని వెలిగించి విద్యార్థులతో మరియు వారి తల్లిదండ్రులతో కలిసి గొబ్బియాలు తట్టారు.

పవిత్ర రెడ్డి మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్ నందు విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన పై ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్లల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్మించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page