top of page

అధికార పార్టీ నాయకుల అక్రమాలు, యధేచ్ఛగా కోనసాగుతున్న మట్టి దందా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 2, 2022
  • 1 min read

అధికార పార్టీ నాయకుల అక్రమాలు


యధేచ్ఛగా కోనసాగుతున్న మట్టి దందా, కుంటముక్కల నాయకులదే హవా, చోద్యం చూస్తున్న అధికారులు పోలీసులు, మైలవరం నియోజకవర్గం లో చర్చనీయాంశంగా మారిన మట్టి దోపిడీ. ఎట్టకేలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు జెసిబిలు ట్రాక్టర్ల ను స్వాదీనపరుచుకున్న జి కొండూరు పోలీసులు. జి కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో మైలవరం కు చెందిన ఒక నాయకుని సహకారం తో అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసుల జెసిబీలను ట్రాక్టర్ లను స్వాదీనపరుచుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓ నాయకుని పేరుతో ఉన్న జెసిబి లు కావడం తో అక్రమ మట్టి రవాణపై చర్చ నియోజకవర్గం లో చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతున్న మట్టిదోపిడీపై అధికారులు దృష్టి సారించాలి అని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page