నవంబర్ 2 నుంచి సదరం స్లాట్ల బుకింగ్ ప్రారంభం: మున్సిపల్ కమిషనర్

నవంబర్ 2 నుంచి సదరం స్లాట్ల బుకింగ్ ప్రారంభం: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్

ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని దివ్యాంగులు సదరం (SADAREM) సర్టిఫికెట్లు పొందేందుకు వీలుగా నవంబర్ 2వ తేదీ నుంచి స్లాట్ల బుకింగ్ ప్రారంభం కానుందని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. నేడు స్థానిక జిన్నా రోడ్ వార్డు సచివాలయాన్ని సందర్శించిన ఆయన, సదరం సర్టిఫికెట్లు లేని అర్హులైన దివ్యాంగులను గుర్తించే ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధృవీకరణ పత్రాలు పొందాలని ఆయన కోరారు.
పురపాలక సంఘ పరిధిలోని వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీలు తమ సచివాలయాల పరిధిలో సర్టిఫికెట్లు లేని దివ్యాంగులను తక్షణమే గుర్తించి, వారికి తగిన అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు ప్రతి అర్హుడికి అందేలా చూడటమే లక్ష్యంగా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి సర్టిఫికెట్లు పొందేందుకు పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.





Comments