top of page

సొంత నిధులతో సచివాలయ సిబ్బందికి డివైజులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 17, 2022
  • 1 min read

పెద గంట్యాడ: రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే జగన్ మోహన్ రెడ్డి ద్యేయమని వైసిపి గాజువాక ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీ వీ ఎం సీ 64 వార్డు యారాడ సచివాలయం లో డివైస్ లు కొరత ఉందని సచివాలయం సిబ్బంది వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాల శ్రీనివాసరావు సుమారు రూ. 12,000/- వ్యచ్చించి కొత్త డివైస్ లను వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి చేతులు మీదుగా సచివాలయం సిబ్బంది కి అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయం పరిధిలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ జగనన్న ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అని సచివాలయం సిబ్బంది కి, గ్రామ వాలంటరీ లకు సూచించారు. జగన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు పనిచేయాలని సమస్యలతో ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదని ఆవిధంగా పని చేయాలని అన్నారు. కార్యాక్రమంలో యారాడ గ్రామ పెద్దలు, యువకులు, సచివాలయం సిబ్బంది, వాలంటరీ లు, ఆర్ పీ లు మహిళలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page