top of page

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కోడిగుడ్ల సరఫరా ఏజెన్సీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 7, 2022
  • 1 min read

కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం, లచుమర్రి గ్రామాల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కోడిగుడ్ల సరఫరా ఏజెన్సీ, విద్యాధికారులు.

అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న లచ్చమర్రి ఎంపీపీ పాఠశాలను జిల్లా ఉపాధ్యక్షుడు థామస్ సందర్శించాడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు కుళ్ళిపోయినటువంటి గుడ్లను సరఫరా చేయడం చూసి చలించిపోయాడు ఈ పదార్థాలను జంతువులు కూడా తినవు మీరు పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నారని వాగ్వివాదం చేశాడు అనంతరం పిల్లలను మెనూపై సరైన ఆహారం అందిస్తున్నారా లేదా అని అడగ రోజు కూడా నాణ్యతలేని ఆహారం ఇస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏజెన్సీ పై చర్యలు తీసుకొని విద్యార్థులు జీవితాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page