top of page

5లక్షల రూపాయలతో రోడ్లు మరమ్మత్తులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 3, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర రిపోర్టర్ వీర


5లక్షల రూపాయలతో రోడ్లు మరమ్మత్తులు


జీవీఎంసీ 73 వ వార్డు కనితి రోడ్డు వంటలు జంక్షన్ నుండి, వుడా సర్కిల్. టెంపిని స్కూల్ మీదగా చిన్న గంట్యాడ వుడా రోడ్డు జంక్షన్ వరకు ప్రధాన రహదారి దెబ్బతినడంతో రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం సుమారు 5 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో పనులకు ప్రారంభించారు. శుక్రవారం 73 వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత ఆధ్వర్యంలో మరమ్మత్తుల పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ డి శ్రీధర్ లు పాల్గొని భూపతి రాజు సుజాత తో కలిసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సంధర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా రోడ్లు, డ్రైన్లు సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. కార్పొరేటర్ సుజాత మాట్లాడుతూ నిత్యం వందల కొద్ది వాహనాల రాకపోకలు, పాదచారాలతో రద్దిగా ఉండే ఈ ప్రధాన రహదారి గోతులుగా తయారవాడంతో వాహనదారులు, బాటసారులు అవస్థలుపడుతున్న సమస్య తన దృష్టికి రావడంతో తక్షణమే ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వివరించడంతో ఎమ్మెల్యే ఆదేశాలతో కమిషనర్ తక్షణమే జీవీఎంసీ కమిషనర్ 5 లక్షల రూపాయలు రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం మంజూరు చేశారని చెప్పేరు. అలాగే వార్డు పరిధిలో ఇంకా ఇలా గోతులతో ఉన్న అన్ని ప్రాంతాలలో రోడ్లు కూడా సత్వరమే బాగుచేయడం పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు కొత్తవి వేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోరుసు సత్యం రెడ్డి, గుడివాడ అమ్మన్న, తిప్పల అప్పలస్వామి, భూపతి రాజు శ్రీనివాస రాజు, గొంతిన కొండబాబు, వై నాయుడు, మోస, పిలక రాము, రెడ్డి జగన్నాథం, జీవి రావు, కంది పైడి నాయుడు, బంగార్రాజు, మాజీ కౌన్సిలర్ పిల్ల సూర్యకుమారి, కుప్పిలి వరలక్ష్మి, బొమ్మల పద్మ, తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page