top of page

దుర్గాడ జంక్షన్ ఘోర రోడ్డు ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 26, 2022
  • 1 min read

కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం దుర్గాడ జంక్షన్ ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం, ఒకరు మృతి ఇద్దరికి గాయాలు.

గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు దుర్గాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చేబ్రోలు గ్రామంలో ఆదర్శ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు కళాశాల విద్యార్థులతో బయలుదేరింది.దుర్గాడ జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో వెనుక నుంచి వడ్లమూరు నుంచి అన్నవరం వివాహానికి వెళ్తున్న కారు కళాశాల బస్సును బలంగా ఢీకొట్టింది. వెనుక కారును కళాశాల బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.ఈ క్రమంలో వడ్లమూరు గ్రామానికి చెందిన బిక్కిన సత్తిరాజు (57) అక్కడిక్కడే మృతి చెందారు. అంతేగాక అతని సోదరుడు బిక్కిన శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి.అదే విధంగా కారు డ్రైవర్ బండారు కృష్ణ కు కాలు విరిగింది.ఈ సంఘటన స్థలానికి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసరావు, గొల్లప్రోలు ఏఎస్ఐ ప్రసాద్ పరిశీలించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీకి తరలించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page