top of page

టీటీడీ బోర్డు సభ్యుడు లక్షీనారాయణ రాజీనామా - అరెస్ట్..!!

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 3, 2022
  • 1 min read

టీటీడీ బోర్డు సభ్యుడు లక్షీనారాయణ రాజీనామా - అరెస్ట్..!!

అసలు విషయం ఏమిటి :


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి బూదాటి లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. 2021లో లక్ష్మీ నారాయణ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక స్వామీజీ ఆశీస్సులతో లక్ష్మీనారాయణకు టీటీడీలో అవకాశం దక్కిందనే ప్రచారం ఉంది. లక్ష్మీనారాయణ సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఎండీగా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు. ప్రి లాంచ్‌ ఆఫర్‌ పేరిట.. ఫ్లాట్లు ఇస్తామని భారీ మొత్తంలో డబ్బు సేకరించి చేతులెత్తేసిన కేసులో పోలీసులు ఆయన్ను ఆరెస్ట్ చేసారు. దీంతో, ఇప్పుడు లక్ష్మీనారాయణ స్థానంలో మరొకరిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించనున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ పేరిట లక్ష్మీనారాయణ పెద్ద మొత్తం డబ్బు వసూలు చేసారు. హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శ్రావణి ఎలైట్‌ పేరిట 23 ఎకరాల్లో 38 అంతస్తులతో అపార్టుమెంట్లు నిర్మాణం పైన లక్ష్మీ నారాయణ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు.కానీ, వీటి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page