top of page

శ్రీ లక్ష్మీ మాధవరాయస్వామి, పెద్దమ్మ తల్లులను దర్శించుకుని పూజలు నిర్వహించిన"రెడ్యo"

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 16, 2022
  • 1 min read

కడప జిల్లా, మైదుకూరు పట్టణంలో కనుమ పండుగను పురస్కరించుకొని మైదుకూరు పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ మాధవరాయస్వామి మరియు పెద్దమ్మతల్లి దేవుళ్లను ఆదివారం తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు రెడ్యo, తెదేపా నేతలను ఆలయ మర్యాదలతో ఆహ్వానించి పూజలు నిర్వహించి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.


ఈ కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనపాల్ జగన్ మోహన్,తెదేపా జిల్లా మాజీ అధికార ప్రతినిధి కటారు కృష్ణ, తెదేపా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు,ప్రముఖ న్యాయవాది రామిశెట్టి శ్రీనివాసులు,బి కొత్తపల్లె సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ముత్తూరు రఘురామిరెడ్డి, తెదేపా నేతలు మేకల సుబ్బరాయుడు, బండి రెడ్డయ్య,శీలo వెంకట రాముడు, రెడ్యo శ్రీకాంత్ రెడ్డి, ఇండ్ల సిద్ధార్థ రెడ్డి, రెడ్యo నారాయణ రెడ్డి,గంగా సుబ్బరాయుడు, చింతకుంట భాష తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page