top of page

నెల్లూరు నగర తెదేపా సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా రెడ్యo

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 5, 2022
  • 1 min read

నెల్లూరు నగర తెలుగుదేశంపార్టీ సంస్థాగత ఎన్నికల పార్టీ కేంద్ర కార్యాలయం పరిశీలకుడిగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి *రెడ్యం వెంకటసుబ్బారెడ్డి* ని నియమిస్తూ తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.


నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా ఘోర ఓటమి అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నెల్లూరు సమీక్ష సమావేశంలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా నెల్లూరు నగరంలోని అన్ని కమిటీలను తెదేపా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు రద్దుచేశారు.


తెదేపా సంస్థాగత నూతన కమిటీలను ఏర్పాటు చేయడానికి *రెడ్యo* ను జనవరి 6 తేదీ నుండి 11వ తేదీ వరకు నెల్లూరు నగరంలో ఉండి తెదేపా నూతన సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయాలని తెదేపా కేంద్ర కార్యాలయం నుండి ఆదేశాలు అందాయి.


తెదేపా కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఆరురోజులు నెల్లూరు నగరంలో ఉండి సంస్థాగత కమిటీలను చిత్తశుద్ధితో ఏర్పాటు చేయడమే కాక నిజాయితీ,నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే సత్తా గల తెదేపా శ్రేణులతో నింపి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని నెరవేరుస్తానని రెడ్యo స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page