top of page

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 29, 2022
  • 1 min read

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


నియోజకవర్గ పరిధిలోని ఆదిత్యా స్కూల్ వద్ద గల ప్రభుత్వ రేషన్ దుకాణం పన్నెండులో పక్కా సమాచారం మేరకు ఆర్.ఐ సాయి ప్ర్రసాద్ ఆధ్వర్యంలో సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించి అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన దాదాపు ఒక టన్ను రేషన్ బియ్యం తెల్ల గోతాలలో నిల్వ ఉంచి ఉండగా స్వాధీనం చేసుకున్న అధికారులు. సంబంధిత రేషన్ డీలర్ గత కొద్ది కాలంగా చౌక బియ్యం నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ వాహనం ద్వారా స్వాధీనం చేసుకున్న అక్రమ రేషన్ బియ్యం గోడౌన్ కు తరలింపు. డీలర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, పూర్తి వివరాలు ఉన్నతాధికారులు వెల్లడిస్తారని చెప్పిన అధికారులు. ఇదిలా ఉండగా ఇక్కడి రేషన్ దుకాణంలో చౌక బియ్యాన్ని వినియోగదారుల ద్వారా తిరిగి కొనుగోలు చేసి నిల్వ ఉంచటం గమనార్హం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page