top of page

వాలంటీర్ల బెదిరింపులు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 17, 2022
  • 1 min read

ఇండ్ల వద్దకు రాకుండానే ఫోన్ లల్లో కొందరు వాలంటీర్ల బెదిరింపులు

అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో గల ఉస్మాన్ నగర్ లో సచివాలయం(1) సచివాలయం (2) విధులు నిర్వహిస్తున్న కొందరు వాలంటర్లు వేదిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.తమకు టార్గెట్ ఉందని ఇన్సూరెన్స్ చేసుకోవాలని అలాగే ఇంటి వద్దకు రాకుండానే ఫోన్ల ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఓటిపి నెంబర్ చెప్పాలని సంబంధిత పత్రాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లేకుంటే మీ రేషన్ కార్డ్, పెన్షన్ తీసేస్తారని బెదిరిస్తున్నారని ఉస్మాన్ నగర్, ఎర్రబల్లి, మన్నూరు, సంబంధిత ప్రాంతాల వారు వాపోతున్నారు.ఇంటి వద్దకు రాకుండానే ఫోన్లు ద్వారా అడగడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి అయోమయ పరిస్థితి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page