top of page

రైల్వేకోడూరు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మిథున్ రెడ్డి, కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 14, 2022
  • 1 min read

రైల్వే కోడూరు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మిథున్ రెడ్డి, కొరముట్ల

ఈరోజు ఉదయం రైల్వే కోడూరు నందు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలకు ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరై పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ సంఘసంస్కర్త,రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అంబేద్కర్... ఆర్థిక, రాజకీయ,సామాజిక ఇలా అన్ని రంగాలలోనూ అందరూ ఎదగాలన్న ఉద్దేశంతో తాను రూపొందించిన విధి విధానాలు మనందరికీ స్ఫూర్తిదాయక మన్నారు. అంతటి మహా పురుషుని జయంతిని పార్టీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించడం గర్వకారణమని పేర్కొంటూ వారి అడుగు జాడల్లోనే వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పరిపాలన చేస్తూ ఉన్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మండలాల వైసీపీ పార్టీ కన్వీనర్లు సుధాకర్ రాజు, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి నాయకులు, ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర రెడ్డి, కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, ఎంపీపీ చంద్ర, ఉప ఎంపిపి సుబ్రహ్మణ్యం రెడ్డి,సర్పంచ్ బాలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page