top of page

సంక్షేమ పధకాలు ప్రజలలోకి తీసుకువెళ్ళాలి - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 23, 2023
  • 1 min read

సంక్షేమ పధకాలు ప్రజలలోకి తీసుకువెళ్ళాలి - రాచమల్లు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పధకాలు విస్తృతంగా ప్రజలలోకి తీసుకునివెళ్ళి, తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేలా ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకు నుండి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి రాజారామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొనగా, మరో వైపు ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి రాచమల్లు రమాదేవి పలువురు వైసీపీ మహిళా నాయకురాల్లు తన వెంటరాగా లింగాపురం గ్రామం బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పధకాల అమలులో వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోందని, కావున ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకునివెళ్ళి వారికి పధకాలపై అవగాహన కల్పిస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, ఎంపీపీ శేఖర్ యాదవ్, యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ గోపాల్, నాటక అకాడమీ డైరెక్టర్ బండారు సూర్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయకుడు కాకర్ల నాగశేషా రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page