top of page

నాపై సీబీఐ విచారణ చేయమని లిఖతపూర్వకంగా కోరుతాను - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 15, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించిన నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టిడిపి నాయకులు అరెస్టును ఖండిస్తూ, నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై పలు ఆరోపణలు చేశారని, శనివారం మధ్యాహ్నం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు టిడిపి నాయకుల ఆరోపణలను ఖండిస్తూ, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారని, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారని అన్నారు. టిడిపి నాయకులు నియోజకవర్గంలో రాచమల్లు అరాచకాలు పెరుగుతున్నాయి అని అనటం హాస్యాస్పదంగా ఉందని, అందుకే తాను అవినీతిని అక్రమాలను దౌర్జన్యాలు హింసను ప్రేరేపించినట్లు పాల్పడినట్టు అయితే సిబిఐ విచారణను తనపై తానే లిఖతపూర్వకంగా కోరనున్నట్లు, మరి ఇదే సిబిఐ విచారణను టిడిపి నాయకులు కూడా వారిపై కోరతారా అని సవాల్ విసిరారు. గడచిన పాతిక సంవత్సరాలలో తాను ఏనాడు అవినీతికి దౌర్జన్యాలకు పాల్పడలేదని, ఎన్నడూ హింసను ప్రేరేపించలేదని ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page