top of page

23న ప్రొద్దుటూరుకు పురందేశ్వరి రాక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 21, 2023
  • 1 min read

23న ప్రొద్దుటూరుకు పురందేశ్వరి రాక

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


రాబోవు ఎన్నికల వ్యూహరచనలలో భాగంగా రాయలసీమ లోని ఏడు జిల్లాల జోనల్ సమావేశాన్ని ఈనెల 23న ప్రొద్దుటూరులో నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి నూతన బిజెపి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాయలసీమ జోనల్ మీటింగ్ లో పాల్గొననున్నట్లు, కావున రాయలసీమ జోనల్ పరిధిలోని ఏడు జిల్లాల కన్వీనర్లు, ముఖ్య నాయకులు జోనల్ సమావేశానికి హాజరుకావాలని, శుక్రవారం సాయంత్రం ప్రొద్దుటూరు బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోనల్ ఇంచార్జ్ బిట్ర శివ నారాయణ కోరారు. కార్యక్రమంలో కడప జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, బిజెపి నాయకులు శరత్ బాబు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page