పండుగ రోజున ఈత సరదా ప్రాణం తీసింది
- DORA SWAMY

- Apr 2, 2022
- 1 min read
కడప జిల్లా, ఉగాది పండుగ సందర్భంగా పుల్లంపేట మండలంలో విషాదం.

పుల్లంపేట మండలంలోని దేవసముద్రం వద్ద ఉన్న కేసి కెనాల్ గుంతలో ఈతకు వెళ్లిన 12 మంది యువకులు. విశ్వనాథ అనే మూగ యువకుడు గల్లంతు. సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి మృత దేహాన్ని బయటకు తీసిన పుల్లంపేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. యువకుని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




Comments