top of page

ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 20, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధిలోని వివిధ వార్డుల యందు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు శంఖుస్థాపనలు శరవేగంగా జరుగుతున్నాయి, ఇందులో భాగంగా నేడు పట్టణంలోని 2వ వార్డు నందు 26 లక్షల రూపాయల వ్యయంతో 220 మీటర్లు సీసీ రోడ్డు, కాలువల నిర్మాణానికి నేడు స్థానిక ఎం.ఎల్.ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. అలాగే స్థానిక వై.ఎం.ఆర్ కాలనీ ఎంట్రన్స్ ముఖద్వారము వద్ద ఆర్చి నిర్మాణానికి భూమి పూజ చేశారు, అనంతరం హోమస్ పేట నాలుగు రోడ్ల కూడలి వద్ద శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ ఆర్చి నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని అన్ని వార్డుల యందు సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు మరమ్మత్తులు చేపట్టామని, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఎక్కడికక్కడ పారిశుధ్య పనులు మునిసిపల్ అధికారులు చేపడుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ రాచమల్లు, మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ కమీషనర్, వైసీపీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page