ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఛైర్మెన్ టీడీపీ కైవసం
- VOICE OF HERALD

- Aug 19, 2024
- 1 min read
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఛైర్మెన్ టీడీపీ కైవసం

కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరు నందు ఈరోజు టౌన్ బ్యాంక్ ఛైర్మెన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఛైర్మెన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండడం ఇక్కడ గమనార్హం. వ్యక్తిగత కారణాల వలన గత ఛైర్మెన్ వై.కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక లాంఛనం అయింది. ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి బలపరిచిన బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి టౌన్ బ్యాంక్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు. ఈయన గడచిన 14 సంవత్సరాల నుండి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మెన్ బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.




Comments