top of page

అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తున్న ఏసిపి మునిరత్నం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 24, 2024
  • 1 min read

అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తున్న ఏసిపి మునిరత్నం

మాట్లాడుతున్న సీనియర్ టిడిపి నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ ఏసిపి మునిరత్నం కాసులకు కకృతి పడి ఎడాపెడా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారని ప్రొద్దుటూరు టిడిపి సీనియర్ నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ రోడ్డు మొదలులో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని టిడిపి నాయకులు సందర్శించి ప్లానింగ్ కు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని, ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఏసీబీ మునిరత్నం వత్తాసు పలుకుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వటం వలన ట్రాఫిక్ సమస్య అధికమైందని అభిప్రాయపడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇప్పటివరకు మునిరత్నం లాంటి అవినీతిపరుడు లేడని ఇకపై రాబోడని, నాటి వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి ఏసిపి మునిరత్నంతో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇప్పించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్ స్పందించి పట్టణంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అక్రమ కట్టడాలను పరామర్శించిన వారిలో టౌన్ బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డి, టిడిపి నాయకులు నల్లబోతుల నాగరాజు, బిజెపి నాయకులు నాగేంద్ర తదితరులు ఉన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page