top of page

టిడిపి బలం ప్రజలలో ఉప్పెన వలె పెరిగింది - శ్రీనివాసుల రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 28, 2023
  • 1 min read

టిడిపి బలం ప్రజలలో ఉప్పెన వలె పెరిగింది - శ్రీనివాసుల రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసిపి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇంటింటికీ వెళ్లగా ప్రజల గో బ్యాక్ అనే నినాదాలతో వెనుతిరిగి వచ్చారని, ప్రజలలో ఉన్న తమ నాయకుడిని అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారని, ఇది గమనించిన ప్రజలలో టిడిపి పై సానుకూల స్పందన పార్టీపై నమ్మకం ఉప్పెన వలె పెరిగిందని కడప పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకున్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమ కేసులు బనాయించి బాబును జైలు పాలు చేశారని, త్వరలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబును కూడా అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమిపాలు అవుతుందనే భయం వల్లనే ప్రతిపక్ష నేతను అక్రమ అరెస్టు చేశారని, కడిగిన ముత్యము వలె బాబు ప్రజలలోకి తిరిగి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ, బాబుకు మానసిక ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page