top of page

ఈనాడు కార్యాలయం పై రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి - ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 21, 2024
  • 1 min read

ఈనాడు కార్యాలయం పై రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి - ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్

డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం ఇస్తున్న పాత్రికేయులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


మంగళవారం కర్నూలు రాజ్ విహార్ సెంటర్లోని ఈనాడు కార్యాలయం పై రాళ్ల దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ద ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, అనంతరం డిప్యూటీ తాసిల్దార్ మనోహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ, గడచిన రెండు రోజుల క్రితం అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ కృష్ణ పై జరిగిన భౌతిక దాడిని మరువక ముందే, నిన్న కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ కార్యకర్తల మూకుమ్మడి రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను పత్రికా విలువలను కాపాడే దిశగా అడుగులు వేయాలని ఇలాంటి భౌతిక దాడులు హేయమైన చర్యగా వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page