ప్రొద్దుటూరు మునిసిపల్ శాఖ అధికారులకు ప్రశంసా పత్రాలు
- VOICE OF HERALD

- Jan 26, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపల్ శాఖ అధికారులకు అరుదయిన గౌరవం దక్కింది, వివరాల్లోకి వెళితే, కడపలో ఈరోజు 73 వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్ గంగ ప్రసాద్, ఏ ఈ ఉమా మహేశ్వరి, సి 1 గుమస్తా నందం భాస్కర్ లకు ఉద్యోగ రీత్యా మ్యూనిసిపాలిటీకి ఇటు ప్రజలకు ఎల్లవేళలా తమ సేవలు అందించినందుకు గాను, వారికి కడప జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామ రాజు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. గంగా ప్రసాద్ ప్రశంసా పత్రం మేనేజర్ అయినటువంటి రంగ స్వామి అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు రచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, పురపాలక సంఘం ఛైర్పర్సన్, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్ వీరిని అభినందించారు.




Comments