top of page

ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ కు దక్కిన గౌరవం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 3 days ago
  • 1 min read

ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ కు దక్కిన గౌరవం

పోలవరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను (PGRS) జిల్లాలో సమర్ధవంతంగా ముందుగు తీసుకువెళ్ళి 4.4% పాజిటివిటీ పెంచి ప్రజలకు విశేష సేవలు అందించిన ప్రొద్దుటూరు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు, ప్రజల సమక్షంలో రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక పై అభినందించారు. పోలవరం జిల్లా, రంపచోడవరం, జూనియర్ కాలేజీలో జరిగిన మెగా పేరెంట్స్ & టీచర్స్ రాష్ట్రస్తాయి ఆత్మీయ సమావేశంలో శ్రీనివాస విశ్వనాధ్ కు మానవవనరుల శాఖా మంత్రివర్యులు నారా లోకేష్ సమక్షంలో ఈ గౌరవం దక్కింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ గా రాక ముందు శ్రీనివాస విశ్వనాధ్ పోలవరం జిల్లాకు పి.జీ.ఆర్.ఎస్ నోడల్ అధికారిగా వ్యవహారించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page