top of page

7వ వార్డులో 27 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 24, 2024
  • 1 min read

7వ వార్డులో 27 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు, వైసీపీ శ్రేణులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, బుధవారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు స్వరాజ్ నగర్ నందు 27 లక్షల రూపాయల వ్యయంతో నూతన సిసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కౌన్సిలర్ గుర్రం లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, ఇప్పటికే 7వ వార్డులో దాదాపు తొంభై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేశామని, వార్డులో ఎక్కడైనా తమ దృష్టికి రాని మౌలిక వసతులు కల్పన ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సత్వరం స్పందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page