top of page

హాల్ మార్క్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 10, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


పసిడిపురిగా పేరు గాంచిన ప్రొద్దుటూరు పట్టణం దర్గా బజార్ నందు 'ప్రొద్దుటూరు హాల్ మార్క్ సెంటర్' ను నేడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసిడి క్రయవిక్రయాల నాణ్యతా ప్రమాణాలలో ముఖ్య భూమిక హాల్ మార్క్ సెంటర్లదేనని, కొనుగోలుదారులకు అందుబాటులో నేడు పట్టణం నందు ప్రారంభించిన 'ప్రొద్దుటూరు హాల్ మార్క్ సెంటర్' దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు, యజమానులు మురళి, శ్రీను లకు ప్రత్యేక అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, వ్యాపారులు, వర్తకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page