రేపు ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం
- VOICE OF HERALD

- Feb 11, 2022
- 1 min read
ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఉద్యమ కార్యచరణ లో భాగంగా 12-2-22 శనివారం ఉదయం 10 గంటలకు కడపజిల్లా సగర సంఘము (నందిని క్లాత్ మార్కెట్ లోని సెకండ్ ఫ్లోర్ 27 రూమ్ నెంబర్ ) కార్యాలయంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి, బి.సి సమాఖ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రొద్దుటూరు జిల్లా సాధన ఐక్యకార్యాచరణ సమితి P.D.T.R J.A.C నాయకులు మాదాసు మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, కర్షక, వ్యాపార, అన్ని కుల సంఘము నాయకులు, విద్యార్థుల, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని ప్రొద్దుటూరును జిల్లాగా సాదిందు కొనుటకు సూచనలు, సలహాలతో పాటు ఉద్యమ కార్యాచరణ ఏవిధంగా చేపడితే ప్రొద్దుటూరు ను జిల్లా గా సాధించగలము అనే అంశాలపై చర్చించడం జరుగుతుందని కావున నియోజకవర్గంలోని పై తెలిపిన వారందరు పాల్గొనవలసినదిగా కోరారు. మరిన్ని వివరములు ప్రొద్దుటూరు జిల్లా సాధన ఐక్యకార్యాచరణ సమితి P.D.T.R JAC వారిని సెల్ : 9290181679, 7075585426, 9290553951 పై సెల్ నంబర్లకు కాల్ చేయవలసినదిగా కోరారు.



Comments