top of page

సోము వీర్రాజు మాటలను వక్రీకరించారు - ప్రొద్దుటూరు బీజేపీ నాయకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 29, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ జి.శ్రీనివాసులు నేడు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయాల అభివృద్ధి విషయంలో AP బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలను వైసీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు అని, విమానాశ్రయాల అభివృద్ధి కేంద్రంలో ఉన్న బీజేపీ అభివృద్ధి చేస్తుంది అని ఆ విషయాన్నే సోము వీర్రాజు చెప్పారు అన్నారు, సోము వీర్రాజు పై ప్రొద్దుటూరు MLA రాచమల్లు చేసిన వాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. ఈ విషయం పై ఎవరు మాట్లాడిన వైసీపీ నాయకులు తీవ్ర పదజాలంతో దాడికి దిగుతున్నారు అని, ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని చూసిన రాచమల్లు తీరుపై సోము వీర్రాజు బీజేపీ గతంలో చేసిన పొరటంతోనే విగ్రహం ప్రతిష్ట నిలుపుదల అయ్యిందన్నారు. కడపజిల్లా లో జరిగిన వై.ఎస్ వివేకా హత్య విషయం గురుంచి మాత్రమే సోము వీర్రాజు మాట్లాడారు. MLA స్థాయిలో ఉండి నాలుక కోస్తా అని మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. MLA రాచమల్లు చేస్తున్న కోట్ల రూపాయల దానాలు కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడు అని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లెల శ్రవణ్ కుమార్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page